Prime9

IPL 2025 30th Match: టాస్ గెలిచిన చెన్నై.. ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ ధోనీ

Ms Dhoni Choose to Bowl first against Lucknow Super Giants in IPL 2025 30th Match:  2025 ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో గురు శిష్యుల పోరుకు సిద్ధమైంది. ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై.. రిష‌భ్ పంత్ కెప్టెన్సీలోని ల‌క్నోతో కీల‌క మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. హ్యాట్రిక్ విజయంతో జోరు మీద ఉన్న ల‌క్నోను సోమ‌వారం చెన్నై ఢీ కొడుతోంది.

 

ల‌క్నో వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ లక్నో జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ల‌క్నో ఒక మార్పుతో ఆడుతుండ‌గా, చెన్నై జట్టు రెండు మార్పులు చేసిందని కెప్టెన్లు తెలిపారు. వ‌రుస‌గా ఐదు ఓట‌ముల‌తో ప్లే ఆఫ్స్ రేసులో వెన‌క‌బ‌డిన చెన్నై ఈరోజు గెలిచి తీరాల్సిందే. లేకపోతే టాప్ -5 లో నిల‌వ‌డంలో క‌ష్ట‌మ‌వుతుంది.

 

ల‌క్నో తుది జ‌ట్టు: మిచెల్ మార్ష్, ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్, నికోల‌స్ పూర‌న్, ఆయుష్ బ‌దొని, రిష‌భ్ పంత్, డేవిడ్ మిల్ల‌ర్, అబ్దుల్ స‌మ‌ద్, శార్ధూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, దిగ్వేశ్ ర‌థీ ఉన్నారు.

 

ఇంప్యాక్ట్ ప్లేయర్స్: ర‌వి బిష్ణోయ్, ప్రిన్స్ యాద‌వ్, షాబాజ్ అహ్మ‌ద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మ‌త్ సింగ్ ఉన్నారు.

 

చెన్నై తుది జ‌ట్టు: షేక్ ర‌షీద్, ర‌చిన్ ర‌వీంద్ర‌, రాహుల్ త్రిపాఠి, విజ‌య్ శంక‌ర్, ర‌వీంద్ర జ‌డేజా, జేమీ ఓవ‌ర్టన్, ఎంఎస్ ధోనీ, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మ‌ద్, ఖ‌లీల్ అహ్మ‌ద్, ప‌థిర‌న‌ ఉన్నారు.

 

ఇంప్యాక్ట్ ప్లేయర్స్: శివం దూబే, క‌మ‌లేశ్ న‌గ‌ర్‌కొటే, రామ‌కృష్ణ ఘోష్, సామ్ క‌ర‌న్, దీప‌క్ హుడా ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar