IPL 2025 Mega Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. రికార్డు బ్రేక్

Rishabh Pant Makes History, Breaks Iyer’s Rs 26.75 Crore: ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్‌ను అత్యధిక ధర రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ రికార్డు నమోదైన కాసేపటికే.. లక్నో బ్రేక్ చేసింది. రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఈ వేలంలో బట్లర్‌ను రూ.15.75కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. గతేడాది అత్యధిక ధరకు అమ్ముడు పోయిన స్టార్క్.. ఈ ఏడాది రూ.11.75 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

అయితే, అంతకుముందు రిషబ్ పంత్ కోసం హైదరాబాద్, లక్నో తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆర్టీఎమ్ పద్ధతిలో ఢిల్లీ దక్కించుకునేందుకు ప్రయత్నించినా..  చివరికి లక్నో కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న మహ్మద్ షమిని రూ.10కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అలాగే దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. ఇక, భారత్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18కోట్లకు పంజాబ్ సొంతం చేసుకోగా.. భారత్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిరాజ్.. చాలా సీజన్లుగా బెంగళూరు తరఫున ఆడాడు. అదే విధంగా ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ.8.75కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.