KKR Vs LSG in IPL 2025 21stt Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు చెలరేగారు. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నో జట్టులో నికోలస్ పూరన్ 87 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 81, మార్క్రం 47 పరుగుల అద్భుత ప్రదర్శతో అదరగొట్టారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రెండు, రస్సెల్ ఒక వికెట్ తీశారు. 239 పరుగుల భారీ లక్ష్యంతో కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. కోల్‌కతా 11 ఓవర్లకు 132 చేసింది. అదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్, అజింక రహానే ఉన్నారు. కెప్టెన్ అజింక రహానే 26 బంతుల్లో 51 పరగులు చేసి, హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 27 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.