Site icon Prime9

LSG vs PBKS : లక్నో పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన పంజాబ్.. రాణించిన రజా, షారుఖ్ ఖాన్

lsg-vs-pbks match highlights in ipl 2023

lsg-vs-pbks match highlights in ipl 2023

LSG vs PBKS : ఐపీఎల్ 2023 లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 159 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విక్టరీతో ఈ సీజన్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది పంజాబ్ జట్టు. నిజానికి.. కాగా పంజాబ్ ప్లేయర్ సికిందర్‌ రజా 57 పరుగులు 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు అర్ధ శతకంతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. కానీ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోవడం, స్కోరు కూడా నిదానంగా ముందుకు వెళ్తుండటం చూసి, పంజాబ్ గెలవడం కష్టమేనని అంతా అనుకున్నారు. టాపార్డర్‌తో పాటు స్టార్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో, ఇక పంజాబ్ ఓటమి తథ్యమని భావించారు.

అలాంటి సమయంలో చివర్లో షారుఖ్ ఖాన్ 23 పరుగులు 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు మెరుపు బ్యాటింగ్ తో పంజాబ్ విజయం లాంఛనం అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో యుధ్ వీర్ సింగ్ చరక్ 2, మార్క్ వుడ్ 2, రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ 1, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.

ఇక తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో తరఫున కేఎల్ రాహుల్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ (56 బంతుల్లో 74) ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ఒంటరి పోరాటానికి కైల్ మేయర్స్ 29 పరుగులు 23 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు తో మొదట్లో సహకరించినా.. ఆ తర్వాత లక్నో బ్యాటర్లు అందరూ పెవిలియన్ బాట పట్టడంతో  తక్కువ స్కోరుకు పరిమితం కావలసి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో మాథ్యూ షార్ట్ 34, హర్ ప్రీత్ సింగ్ భాటియా 22 పరుగులు చేశారు.   పంజాబ్ బౌలర్లలో  ఆ జట్టు కెప్టెన్ సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా  రబాడా  రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 74 పరుగులు చేయగా.. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని కూడా అందుకున్నాడు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ టీమ్స్‌కి గతంలో ఆడిన క్రిస్‌గేల్.. 112 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ని చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4000 పరుగులు చేసి గేల్ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. 2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 114 మ్యాచ్‌ లు ఆడాడు. 135.16 స్ట్రైక్‌రేట్‌తో 4044 పరుగులబు రాహుల్ పూర్తి చేశాడు. వీటిలో 4 సెంచరీలతో పాటు 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీజన్‌లో ఐదో మ్యాచ్ ఆడిన పంజాబ్‌కి ఇది మూడో గెలుపు కాగా.. లక్నోకి ఇది రెండో ఓటమి.

Exit mobile version