Site icon Prime9

Ishan Kishans Dismissal: ఇషాన్‌ కిషన్‌ది క్రీడా స్ఫూర్తా..! తెలివి తక్కువతనమా..?

IPL 2025

IPL 2025

Ishan Kishans Dismissal in IPL 2025: ముంబయి ఇండియన్స్‌తో సొంత గడ్డంపై జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఔట్‌ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబయి జట్టు బౌలింగ్‌ టీమ్‌ నుంచి ఒక్కరు కూడా అప్పీల్‌ చేయకున్నా అంపైర్‌ అత్యుత్సాహంతో చేయి లేపాలా.. వద్దా? అని సంశయిస్తున్న నేపథ్యంలో ఇషాన్‌ కిషన్ తానేదో గొప్ప త్యాగం చేసినట్టుగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీజును వదిలి బయటకు వెళ్లాడు.

 

కానీ, టీవీ రిప్లైలో చూసిన తర్వాత గానీ అర్థం కాలేదు తాను తప్పులో కాలేశానని.. ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో సెంచరీని మినహాయిస్తే కనీసం డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయడానికి నానా తంటాలు పడ్డాడు. ఇషాన్‌ కిషన్ ముంబయి మ్యాచ్‌లో అయినా రాణిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, విధి మరోలా తలచింది.

 

అసలు ఏమి జరిగిందంటే..
ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ ఔట్ అయిన తర్వాత ఇషాన్‌ కిషన్ క్రీజులోకి వచ్చాడు. ముంబయి బౌలరు చాహర్‌ మూడో ఓవర్‌లో తొలి బంతిని లెగ్‌ సైడ్‌ దిశగా వేశాడు. దాన్ని ఇషాన్‌ ఆడబోయినా బంతి అది కాస్తా మిస్‌ అయి కీపర్‌ చేతుల్లో వెళ్లింది. కీపర్‌ రికెల్టన్‌ బంతినందుకున్నాక యథావిధిగా ఇతరులకు పాస్‌ చేశాడు. బౌలర్ చాహర్‌ మరో బంతి వేయడానికి వెళ్తున్నాడు.

 

ముంబయి ఇండియన్స్ ఫీల్డర్లు సైలెంట్‌గా ఉండగా, అంపైర్‌ చేతిని కాస్త పైకి లేపి ఎవరూ అప్పీల్‌ చేయరేంటి? అన్నట్టుగా అటు ఇటు చూస్తూ ఔట్‌ ఇవ్వాలా? వద్దా? అని సంశయంలో ఉన్నాడు. అంపైర్‌ అత్యుత్సాహాన్ని గమనించిన బౌలరు చాహర్‌ అప్పీల్‌ చేయకముందే అప్పటికే సగం లేచి ఉంచిన చేతిని పూర్తిగా లేపి ఔట్‌ అని ప్రకటించి తన భారం దించుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్ బంతి బ్యాట్‌కు తాకి ఉండొచ్చన్న అపనమ్మకంతో పెవిలియన్‌ దిశగా వెళ్లాడు. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న ముంబయి ఆటగాళ్లు మనోడి క్రీడా స్ఫూర్తిని మెచ్చుకున్నారు. కానీ, టీవీ రిప్లైలో బంతి అసలు బ్యాట్‌కు తాక లేదని స్పష్టంగా కనిపించింది. దీంతో ఇషాన్‌ కిషన్‌ది క్రీడా స్ఫూర్తా? లేక తెలివి తక్కువ తనమా అర్థం కాక హైదరాబాద్ అభిమానులు జుట్టు పీక్కున్నారు.

Exit mobile version
Skip to toolbar