Prime9

DC won the Match: పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం!

DC won the Match against PKBS in IPL 2025: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ ఖాయం చేసుకున్న జట్లకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆర్సీసీబీకి ఎస్‌ఆర్‌హెచ్ షాక్‌ ఇచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాప్‌ ప్లేస్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ నీళ్లు గుమ్మరించింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి వెళ్లాలని అనుకున్న పంజాబ్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై సూపర్ విక్టరీ సాధించింది.

పంజాబ్‌ కింగ్స్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. సమీర్‌ రిజ్వి 25 బంతుల్లో 58 నాటౌట్‌‌గా నిలిచారు. కరణ్‌నాయర్‌ 44 పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 35 చేశాడు. బ్రార్‌(2/41)కు రెండు వికెట్లు దక్కాయి. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ 34 బంతుల్లో 53 అర్ధసెంచరీ చేశాడు. స్టొయినిస్‌ 16 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. పంజాబ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. రెహమన్‌ మూడు వికెట్లు తీశాడు. రిజ్వికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Exit mobile version
Skip to toolbar