Indian Cricketer Rinku Singh Will Engaged To Samajwadi Party MP Priya Saroj: భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఓ ఇంటివాడవుతున్నాడు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ మేరకు జూన్ 8వ తేదీన వీరిద్దరూ లక్నోలో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్నోలోని ఓ పైవ్ స్టార్ హోటల్‌లో ఉంగరాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరుకానున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే వీరిద్దరూ స్నేహితుల ద్వారా కలుసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాదికాలంగా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలు వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
25 ఏళ్ల ప్రియా సరోజ్ ప్రస్తుతం యూపీలోని మచిలీషహర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమె గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా సైతం విధులు నిర్వహించారు. ఇక, రింకూ సింగ్.. కేకేఆర్‌లో కీలక ఆటగాడిగా వ్యవహరిస్తున్నారు. టీమిండియాలో యంగ్ క్రికెటర్‌గా కొనసాగుతున్నారు.