Site icon Prime9

IND vs ZIM 2nd ODI: నేడు భారత్-జింబాబ్వే మధ్య రెండో వన్డే

IND vs ZIM 2nd ODI: భారత్- జింబాబ్వే మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ హరారే వేదికగా ఇవాళ జరగనుంది.

ఈ వన్డేలోనూ గెలిచి టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంత ప్రేక్షకుల అభిమానం పొందాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మార్పులేమి లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి

Exit mobile version