India vs Australia: భారత్‌తో రెండో టెస్ట్.. ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్

India vs Australia Second Test Match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ జరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండొో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా మొత్తం 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(140: 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించగా.. లబుషేన్(64: 126 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఓపెనర్ ఖవాజా(13), మెక్ స్వీనీ(39), స్టీవెన్ స్మిత్(2), మిచెల్ మార్ష్(9), అలెక్స్ క్యారీ(15), కమిన్స్(12), మిచెల్ స్టార్క్(18), లియాన్(4), బోలాన్డ్(0) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా భారత్ బౌలర్లలో జస్మిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(7), యశస్వి జైస్వాల్(24) పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి(11), శుభమన్ గిల్(19) క్రీజులో ఉండగా.. భారత్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.