Site icon Prime9

India vs Australia: పట్టు బిగించిన ఆసీస్.. హెడ్, స్మిత్ సెంచరీలతో భారీ స్కోరు

India vs Australia 3rd Test: గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడవ టెస్ట్‌లో ఆసీస్.. భారీ స్కోరు సాధించింది. శనివారం వర్షం కారణంగా 13.1 ఓవర్లకే ఆట ఆగిపోగా, ఆదివారం ఉదయం మళ్లీ మొదలైంది. మొదటి సెషన్ ఆరంభంలో ఆసీస్ కీలక వికెట్లు పడినా… ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లు భారత బౌలర్లను ఓ ఆట అడుకున్నారు. నిలకడగా ఆడుతూ, బంతులను బౌండరీలకు తరలించారు.

ఈ మ్యాచ్‌లో హెడ్.. సెంచరీతో చెలరేగి, 152 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హెడ్‌కు జోడీగా బ్యాటింగ్ చేసిన స్టీవ్‌ స్మిత్ 190 బంతుల్లో 12 ఫోర్లు కొట్టి సెంచరీ చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది.

Exit mobile version