Site icon Prime9

ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

India Squad Announced for ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నికవ్వగా.. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఇందులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 13 వరకు అవకాశం కల్పించారు. ఇక, చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీమ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుండగా.. ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్థాన్, మార్చి 2వ తేదీన న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా తలపడనుంది. అయితే ఈ టోర్నీ దాదాపు 8 ఏళ్ల తర్వాత జరగనుంది. అంతకుముందు టీమిండియా 2013లో ధోనీ కెప్టెన్సీలో విన్నర్‌గా నిలిచింది.

ఇదిలా ఉండగా, చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరగనుంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా జట్టు మాత్రమే తన మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్ పద్ధతితో ఆడనుంది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న జరగనుంది. ఇందులో భాగంగానే టీమిండియా జట్టును చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు 15 మందితో కూడిన ఆటగాళ్లను ప్రకటించారు.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజాలను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

Exit mobile version