Site icon Prime9

Ind vs Aus 1st ODI: ఆదిలోనే ఎదురుదెబ్బ.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్

aus bowling

aus bowling

Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. వరుసగా ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.

నిప్పులు చెరుగుతున్న ఆసీస్ బౌలర్లు..

ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి వన్డేలో ఆసీస్ బౌలర్లు రాణిస్తున్నారు.

వరుసగా ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ను ఔట్ చేశారు.

వరుసగా వికెట్లు కోల్పోవడంతో.. భారత్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది.

ఇక ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు అందుకున్నాడు. మెుదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.

ఆ జట్టు కేవలం 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

జోష్ ఇంగ్లీస్ 26 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగానే వెనుదిరిగారు.

ముగ్గురు ఎల్ బీడబ్యూ.. (Ind vs Aus 1st ODI)

తొలి వన్డేలో ఆసీస్ బౌలర్లు అదరగొడుతున్నారు. ముగ్గురు బ్యాట్స్ మెన్స్ ఎల్ బీడబ్యూ గా వెనుదిరిగారు. ఇషాన్ కిషాన్ మూడు పరుగులకే ఔటయ్యాడు.

కోహ్లీ 4పరుగులకే వెనుదిరుగగా.. సూర్య కుమార్ డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలింగ్ లో స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. స్టోయిన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.

ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ కొనసాగుతున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 188 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత్ బౌలింగ్ లో మహమ్మద్ షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా 2 రెండు వికెట్లు తీయగా.. కుల్‌దీప్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు.

బౌలర్లు చెలరేగడంతో 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది.

Exit mobile version