Site icon Prime9

India vs Newzealand : న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

India, Newzeland

India, Newzeland

India vs Newzealand champions trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో లీగ్ దశను భారత్ ఓటమి లేకుండా ముగించింది. ఆదివారం ఇండియా- కివీస్‌లో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ల ధాటికి కివీస్ ఆటలాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. లక్ష్యఛేదనలో ఇండియా స్పన్నర్ల ధాటికి కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేసి పోరాడాడు. ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇండియా బ్యాట్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు చేయడా, అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45) పరుగులతో రాణించారు. ఇండియా, కివీస్ ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నెల 4న జరిగే తొలి తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్నది.

Exit mobile version
Skip to toolbar