Site icon Prime9

IND vs SA 3rd T20: సఫారీ దెబ్బకు టీమిండియా అబ్బా !

cricket prime9news

cricket prime9news

IND vs SA T20: టీ20 వరల్డ్‌కప్ 2022 టీమిండియాకు ఊహించని షాక్ గట్టిగా తగిలింది.ఇండోర్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం.మొదటి దక్షిణాఫ్రికా బౌలర్లు ఒక రేంజులో పరుగులివ్వగా…ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కి క్యూ కట్టారు.దానితో సఫారీల చేతిలో 49 పరుగుల తేడాతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.ఈ మ్యాచ్‌తో మూడు టీ20ల సిరీస్ కూడా ముగియగా.. 2-1తో టీమిండియా సిరీస్ను సాధించింది.ఈ నెల 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2022 ప్రారంభంకానుండగా..నిన్న ఆడిన మూడో టీ20లో టీమిండియా ఓడిపోవడంపై నెటిజన్స్ ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 120 బాల్స్ కు 227 పరుగులు చేయగా..టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకి ఆలౌటైంది.

ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్, శ్రేయాస్ అయ్యర్ (1), సూర్యకుమార్ యాదవ్ (8) పరుగులలే పరిమితం అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన రిషబ్ పంత్ 14 బాల్స్ కు (27) పరుగులు, నెం.4లో ఆడిన దినేశ్ కార్తీక్ 21 బాల్స్ కు (46) పరుగులు చేశాడు.దినేష్ కార్తీక్ తప్ప ఎవరూ మెరుగైన ఆటను ఆడలేదు.ఈ మ్యాచ్‌కి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారన్న మన అందరికీ తెలిసిందే.

Exit mobile version