Site icon Prime9

IND vs AUS: చేతులెత్తేసిన భారత్.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం

IND vs AUS

IND vs AUS

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో మంచి ప్రతిభ చూపిన భారత జట్టు మూడో టెస్టులో మాత్రం ఆసీస్ ముందు చతికిలపడింది.

తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు చాప చుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

 

బౌలర్లు విజృంభిస్తేనే(IND vs AUS)

బౌలర్లు ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్లు మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలోనూ బోల్తా పడ్డారు. ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ భారత్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

ఏకంగా 8 వికెట్లు పడగొట్టి భారత్‌పై సరికొత్త రికార్డు సృష్టించాడు.

అతడి దెబ్బకు రోహిత్ శర్మ (12), శుభమన్ గిల్ (5), చతేశ్వర్ పుజారా ((59), రవీంద్ర జడేజా (7), శ్రీకర్ భరత్ (3), రవిచంద్రన్ అశ్విన్ (16),

ఉమేశ్ యాదవ్ (0), మహమ్మద్ సిరాజ్ (0) పెవిలియన్‌కు చేరారు.

ఆఖరిలో పుజారా అర్ధ సెంచరీతో ఆదుకోకపోతే జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీంతో మూడో రోజు ఉదయం భారత బౌలర్లపైనే భారం పడనుంది.

తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన విధంగా.. ఈ సారి కూడా టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించాలి.

 

ముగిసిన రెండో రోజు ఆట

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 156/4 తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 41 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఉమేష్ యాదవ్ తలో 3 వికెట్లు తీసుకున్నారు. హ్యాండ్స్‌కోంబ్(19),

అలెక్స్ క్యారీ(3), లియోన్(5)లను అశ్విన్ బోల్తా కొట్టించగా.. గ్రీన్(21), స్టార్క్(1), టీ ముర్ఫీ(0)లను ఉమేష్ యాదవ్ పెవిలియన్ పంపించాడు.

దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 163 పరుగులకే కుప్పకూలడంతో 75 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.

భారత జట్టు ఆలౌట్ కావడంతో రెండో రోజు ఆట ముగిసింది.

 

 

Exit mobile version
Skip to toolbar