Site icon Prime9

IND vs AUS 4th test: ముగిసిన తొలిరోజు ఆట.. పట్టు బిగించిన ఆసీస్

Ind vs Aus 4th Test

Ind vs Aus 4th Test

IND vs AUS 4th test: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.

కాగా, ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌((IND vs AUS 4th test) లో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

ఇందులో ఉస్మాన్‌ ఖవాజా 251 బంతుల్లో 15 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ 49 పరుగులు చేసి అర్థ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నాడు.

మరో వైపు ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేయగా.. లబుషేన్‌ (3), హ్యాండ్స్‌కాంబ్ 17, స్టీవ్ స్మిత్ 38 పరుగులు చేశారు.

ఇక పోతే ఇండియన్ బౌలర్లలో మహమ్మద్‌ షమి 2 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

 

లంచ్‌ బ్రేక్‌కి రెండు వికెట్లు(IND vs AUS 4th test)

ఆరంభంలో ఆచితూచి ఆడి తర్వాత దూకుడు పెంచిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను అశ్విన్‌ పెవిలియన్ కు పంపాడు.

జడేజాకు క్యాచ్‌ ఇచ్చిన హెడ్ నిష్క్రమించక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే లబుషేన్‌ (3)ను షమీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 29 ఓవర్లలో 75 పరుగులు చేసింది.

లంచ్ తర్వాత రెండో సెషన్ ను ప్రారంభించిన ఆసీస్‌ బ్యాటర్లు నెమ్మదిగా ఆడి భారత బౌలర్లను పరీక్ష పెట్టారు.

దీంతో వికెట్ పడకుండానే ఆ సెషన్‌ ముగిసింది. ఈ సెషన్‌లో ఆసీస్‌ 74 పరుగులు చేసింది.

 

జడ్డూకి చిక్కిన స్టీవ్ స్మిత్

అనంతరం దాదాపు 40 ఓవర్ల తర్వాత ఆసీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. టీ విరామం తర్వాత స్టీవ్‌ స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు.

దీంతో ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు చేసిన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

స్టీవ్‌ స్మిత్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షమీ వేసిన (70.4వ ఓవర్‌) బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్‌ దూకుడుగా ఆడగా.. ఖవాజా నెమ్మదిగా ఆడాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 82 ఓవర్‌, షమీ వేసిన 85 ఓవర్‌లో గ్రీన్‌ రెండేసి బౌండరీలు బాదాడు.

మొదటి రోజు ఆఖరి ఓవర్‌లో షమీ వేసిన తొలి బంతికి ఖవాజా బౌండరీ బాది శతకం పూర్తి చేసుకున్నాడు.

 

Exit mobile version