IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ డకౌట్ గా వెనుదిరిగాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
విశాఖ వేదికగా జరిగన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్.. మిచెల్ స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. ప్రస్తుతం.. 8 ఓవర్లకు భారత్ 48 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు.
గిల్, సూర్య డకౌట్..
ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే సూర్య కుమార్ కూడా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.
విశాఖ వేదికగా నేడు జరిగే రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్‌లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు.