ICC World Test Championship Points Table IND, SA first two places: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాాయింట్స్ టేబుల్‌లో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకగా.. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇక, తర్వాతి స్థానాల్లో శ్రీలకం, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే ఫైనల్ వెళ్లే అవకాశం మూడు జట్లకు మాత్రమే ఉంది.
భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలలో ఏవైనా రెండు జట్లు ఫైనల్ వెళ్లే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసన తర్వాత ఈ విషయంపై క్లారిటీ రానుంది. కాగా, అంతకుముందు ఉన్న పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
జమైకాలోని కింగ్ స్టన్‌లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక అనౌన్స్ చేశారు. వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ గెలవడంతో పాయింట్ల పట్టిక మారింది. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌కు పాయింట్లలో ఐసీసీ కోత విధించడంతో ర్యాంకింగ్స్ మారాయి.
భారత్ 15 మ్యాచ్‌లలో 61.11విజయ శాతంతో 9 మ్యాచ్‌లలో విజయాలు సాధించగా.. 5 మ్యాచ్‌లలో ఓటములతో నంబర్ వన్ స్థానంలో ఉంది. సౌతాఫ్రికా 9 మ్యాచ్‌లలో 59.26శాతంతో 5 మ్యాచ్‌లలో విజయం సాధించగా. 3 మ్యాచ్‌లలో ఓటములతో రెండో స్థానం, ఆస్ట్రేలియా మొత్తం 13 మ్యాచ్‌లు ఆడగా.. 8 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇక 4 మ్యాచ్‌లలో ఓటమి చెంది 57.69 విజయ శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక, చివరి స్థానంలలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ 12 మ్యాచ్‌లలో 31.25 విజయ శాతంతో 4 విజయాలు, 8 ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ 11 మ్యాచ్‌లలో 24.24 విజయ శాతంతో 2 విజయాలు, 7 ఓటములతో చివరి స్థానంలో కొనసాగుతోంది.