Harry Brook as England’s White-ball Captain: అందరూ ఊహించనట్టే జరిగింది. ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ పగ్గాలు యువకెరటం హ్యారీ బ్రూక్‌కు దక్కాయి. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు జోస్ బట్లర్ వారసుడిగా 26ఏళ్ల హ్యారీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేయడంతో కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశారు.
హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టీ20 వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఈ మేరకు ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎన్నిక కావడం తనకు లభించిన గౌరవంగా పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, దేశం కోసం ఆడేందుకు బ్రూక్.. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. మెగా వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అనూహ్యంగా బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
అంతకుముందు, ఐపీఎల్‌లోనూ హ్యారీ బ్రూక్ ఆడలేదు. దీంతో వరుసగా రెండు సార్లు ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఆయనపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అతని బామ్మ మరణం కారణంగా ఐపీఎల్‌కు దూరమవ్వగ.. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు ఐపీఎల్ నుంచి వైదొలిగారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్ వేలంలో కొనుగోలు అయిన ప్లేయర్ ఫిట్‌గా ఉండి వరుసగా ఐపీఎల్ రెండు సీజన్లకు దూరమైతే రెండేళ్ల నిషేధం పడుతుంది. ఈ నేపథ్యంలోనే హ్యారీ బ్రూక్ 2027లో ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంది.