Hardik Pandya injured to Miss ICC Champions Trophy Final Match: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. కింగ్ కోహ్లి మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది.
ఇక, రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్ చేరింది. అయితే ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. అయతే, ఫైనల్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయడినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు కాలికి గాయం తగిలిందని అంటున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.