Double Blow in IPL Today CSK VS DC, Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడునున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యహరించే అవకాశం ఉంది.
ఇక, రెండో మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇదిలా ఉండగా, వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా.. వరుస ఓటములతో రాజస్థాన్ డీలా పడింది. ఇప్పటికే పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 9వ స్థానంలో కొనసాగుతోంది.
అయితే, ఒకప్పుడు ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ సీజన్‌లో వెనుకబడ్డాయి. పాయింట్ల పట్టికలో చెన్నై 8వ స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 9వ స్థానానికి పరిమితమైంది. అదే విధంగా గతంలో ఐపీఎల్ రేసులో తలబడిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ సీజన్‌లో టాప్ 2లో కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ రెండు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి.