Site icon Prime9

David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ ఫైర్.. చాలా అగౌరవంగా ఉందంటూ కామెంట్స్

David Warner

David Warner

David Warner: భారత్, ఆస్ట్రేలియా జట్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఈ నెల 7 న జరుగనుంది. లండన్ లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరో 5 రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా పై విరుచుకు పడ్డాడు.

రివ్యూ పిటిషన్ వెనక్కి

2018 లో క్రికెట్ ఆస్ట్రేలియా లో బాల్ టాంపరింగ్ స్కామ్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ లో స్టీవ్ స్మిత్ తో కలిసి డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ పై రెండేళ్ల నిషేధం పడింది. అంతే కాకుండా వార్నర్ భవిష్యత్ లోనూ కెప్టెన్ కాకుండా బ్యాన్ విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ఱయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో స్టీవ్ స్మిత్ పై మాత్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో వార్నర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన కెప్టెన్సీ బ్యాన్ పై వార్నర్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ముగ్గురు సభ్యుల ప్యానెల్ విచారించింది. ఈ కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్యానెల్ తీసుకున్న నిర్ణయంపై వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాడు.

 

బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రభావం(David Warner)

ఇదే విషయంపై వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషయంలో సీఏ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని వార్నర్ తెలిపారు. గతాన్ని ముగిద్దామని తాను భావిస్తుంటే.. కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ఉందని పేర్కొన్నాడు. ఎవరూ పారదర్శకంగా లేరన్నాడు. ఎవరూ జవాబు దారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకున్నారని వార్నర్ తెలిపారు. సీఏ పాలనలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించిందని వార్నర్ చెప్పాడు.

వదిలేద్దామనుకున్న ప్రతిసారీ సీఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారమంతా తన బ్యాటింగ్‌ ప్రదర్శనపై పెను ప్రభావం చూపిందన్నాడు. టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఫోన్లు వస్తాయని.. లాయర్లతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉందన్నాడు. తనకు అగౌరవంగా అనిపించిందని.. ఇదంతా బ్యాటింగ్ ప్రదర్శనపైనా పడిందని తెలిపాడు. ఈ విషయం జరిగి తొమ్మిది నెలలు అవుతోందన్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం డ్రామా ప్రారంభమైందని.. దాంతీ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యానని డేవిడ్ వార్నర్‌ వ్యాఖ్యానించాడు.

 

Exit mobile version
Skip to toolbar