Site icon Prime9

IND vs NED: నెదర్లాండ్స్ తో నేడు భారత్ పోరు.. గెలుపెవరిది..?

IND vs NED t20 world cup match

IND vs NED t20 world cup match

IND vs NED: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయ విజయం సాధించిన టీం ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా శుభారంభం చేసింది. కాగా నేడు నెదెర్లాండ్స్ సిడ్నీ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌కు రెడీ అయింది.

ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. కాగా భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌ సమిష్టిగా సత్తాచాటాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో విరుచుకుపడిన రోహిత్‌ సేన అదే జోరు కొనసాగించాలని చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని నెదర్లాండ్ ఆశిస్తుంది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్ కనపరిస్తే విజయం భారత్ సొంతం. కోహ్లీ, పాండ్యా ఫుల్‌ ఫామ్లో ఉండగా.. అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌ సత్తాచాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బౌలింగ్‌లోనూ భారత్‌కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు.

పిచ్‌, వాతావరణం
ప్రపంచకప్‌ ఆరంభ పోరులో సిడ్నీ  వేదికగా న్యూజిలాండ్‌ 200 పరుగులు చేసింది. ఈ సారి మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం ఉన్నా, సాయంత్రానికి వాతావరణం ఆటకు అనుకూలంగా ఉండనుంది.

తుది జట్లు అంచనా
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పాండ్యా, కార్తీక్‌, అక్షర్‌, అశ్విన్‌, షమీ, భువనేశ్వర్‌, అర్శ్‌దీప్‌.
నెదర్లాండ్స్‌: ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్‌), డౌడ్‌, విక్రమ్‌జిత్‌, లీడ్‌, కొలిన్‌, కూపర్‌, ప్రింగ్లె, గాగ్టన్‌, క్లాసెన్‌, మీకెరెన్‌, షారిజ్‌ అహ్మద్‌.

ఇదీ చదవండి

Exit mobile version