Site icon Prime9

Rishabh Pant: భారత జట్టుకు మరో షాక్.. ప్రపంచ కప్ కు పంత్ దూరం..?

rishab pant injured photos viral

rishab pant injured photos viral

Rishabh Pant: టీ20 ప్రపంచకప్ ముంగిట భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లైన బుమ్రా, జడేజాలతో పాటు స్టాండ్ బై ప్రేయర్గా ఉన్న దీపక్ చాహర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టార్ ప్లేయర్ అయిన రిషభ్ పంత్ కు గాయమైనట్టు తెలుస్తోంది.

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన టీం ఇండియా వార్మప్ మ్యాచ్‌లో పంత్ పాల్గొనలేదు. మోకాలికి హీల్ ప్యాడ్ ధరించి డగౌట్ లో కనిపించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతకముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ పంత్ ఆడలేదు. కాగా పంత్ గాయం కారణంగానే ఈ మ్యాచుల్లో ఆడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వికెట్ కీపర్ గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 187 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నిర్ణీత ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యి పరాజయం చవిచూసింది. టీమిండియా ఆటగాళ్లులో షమీ నాలుగు వికెట్లు తీసి అద్బుత ప్రదర్శన కనపర్చాడు.

ఇదీ చదవండి: క్యాబ్‌ పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్న సౌరవ్‌ గంగూలీ

Exit mobile version