Site icon Prime9

IND vs AUS Border Gavaskar Trophy: ఆసీస్‌తో ఇండియా టెస్ట్ సిరీస్.. రోహిత్ సేనకు పొంచి ఉన్న ప్రమాదాలేంటో తెలుసా..?

border gavaskar trophy

border gavaskar trophy

IND vs AUS Border Gavaskar Trophy: క్రికెట్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫి. ఈ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది.

ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా టీమిండియా మైదానంలోకి దిగుతుంటే..

గత సిరీస్‌ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు 19 ఏళ్లగా భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలుపొందని ఆస్ట్రేలియా ఈ సారి టెస్ట్ మ్యాచ్ ద్వారా అయినా ఆ కోరికను నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

మరి ఈ నేపథ్యంలో టీమిండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

రికార్డులు బ్రేక్ చెయ్యనున్న భారత సేన

ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ విజయంతో రోహిత్ శర్మ అండ్ కో ప్రపంచ క్రికెట్ లో పలు రికార్డులు బ్రేక్ చేయనున్నారన్న సంగతి తెలిసిందే.

ఈ టెస్ట్ సిరీస్‌తోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఎంట్రీ టిక్కెట్టు ఆధారపడి ఉంది.

ఈ ట్రోఫీలో టీమిండాయా భారీ విజయాలను నమోదు చేస్తేనేగాని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చోటు దక్కించుకోగలదు.

ఇలా ఫైనల్ కు గనుక భారత సేన చేరితే వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరుకున్న జట్టుగా చరిత్రలో పేరు లిఖించబడుతుంది.

అలాగే ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్(IND vs AUS Border Gavaskar Trophy) విజయంతో భారత సేన స్వదేశంలో తన విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది.

ఇకపోతే 2012 నుంచి టీమిండియా స్వదేశంలో ఆడిన ఏ టెస్టు సిరీస్‌ను ఓడిపోలేదు.

ఆ పరంపర కొనసాగేనా..

అదే సమయంలో, గత 10 ఏళ్లలో జరిగిన అన్నీ మ్యాచుల్లో గెలిచిన భారత సేన కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది.

కాబట్టి కచ్చితంగా ఈ రికార్డును బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే చెప్పాలి.

అంతే కాకుండా ఈ సిరీస్ విజయంతో టీమిండియా మళ్లీ టెస్టు మ్యాచుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది.

ఇకపోతే ఈ సిరీస్‌లో ఆసిస్ ను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సాధించాలని టీమిండియా తహతహలాడుటోంది.

ఇదిలా ఉంటే మరోవైపు 2016లో జరిగిన టెస్టు సిరీస్‌, ఆ తర్వాత 2018-19, 2020-21 మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఈ ట్రోఫీని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version