Prime9

Cricket Fight : పిచ్‌పైనే కొట్లాట.. బంగ్లా, సౌతాఫ్రికా ప్లేయర్ల బాహాబాహీ

Cricket match between Bangladesh and South Africa Emerging Teams : బంగ్లా, సౌతాఫ్రికా ఎమ‌ర్జింగ్ జట్ల మ‌ధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు గొడవ ప‌డ్డారు. ఢాకాలో ఇరుజట్ల మ‌ధ్య నాలుగు రోజుల మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో గ్రౌండ్‌లోనే ఇద్ద‌రు ఆటగాళ్లు గొడ‌వ‌కు దిగారు. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ రిపన్ మోండ‌ల్‌పై సౌతాఫ్రికా పేస్ బౌల‌ర్ షిపో నులి చేయిచేసుకున్నాడు. పిచ్‌పై వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ బ్యాటర్‌కు దక్షిణాఫ్రికా బౌల‌ర్ పంచ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌తోపాటు మిగతా ఆట‌గాళ్లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. బంగ్లాదేశ్ బ్యాట‌ర్‌పై మ‌రో సౌతాఫ్రికా ఫీల్డ‌ర్ దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం ఆట‌గాళ్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. మ్యాచ్ అధికారులు త్వ‌ర‌లో రిపోర్టును స‌మ‌ర్పించ‌నున్నారు.

 

ఓ క్రికెట్ వెబ్‌సైట్ ప్ర‌కారం.. నులి బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స‌ర్ కొట్టాడు రిప‌న్. దీంతో ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు చూపులు విసురుకున్నారు. త‌ర్వాత బ్యాటింగ్ పార్ట్న‌ర్‌, నాన్ స్ట్ర‌యిక‌ర్ వ‌ద్ద‌కు బ్యాట‌ర్ వెళ్లాడు. అదే స‌మ‌యంలో బంగ్లాదేశ్ బ్యాట‌ర్‌పైకి దక్షిణాఫ్రికా బౌల‌ర్ దూసుకువ‌చ్చాడు. ఏదో మాట‌లు అనుకుని ఒక‌రినొకరు తోసేసుకున్నారు. త‌ర్వాత గొడ‌వ పెద్ద‌గా మారింది. బ్యాట‌ర్ రిప‌న్ హెల్మెట్‌ను బౌల‌ర్ నులి లాగేశాడు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది.

Exit mobile version
Skip to toolbar