Rilee Rossouw: సఫారీలు విరుచుకుపడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్ రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు.
కేవలం 52 బంతుల్లో రూసో సెంచరీ పూర్తి చేశాడు. కాగా ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. తన ఈ సెంచరీలో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రూసో భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. రూసో 109 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. టీ20 ఫార్మాట్లలో రూసోకు ఇది రెండవ సెంచరీ కావడం విశేషం. ఇకపోతే దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో వికెట్‌కు డికాక్, రూసో మధ్య 163 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. డీకాక్ 38 బంతుల్లో 63 రన్స్ చేశాడు. దీనితో 206 పరుగుల లక్ష్య బరిలో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. ఇక మరి విజయం ఎవరిని వరిస్తోందో వేచి చూడాలి.