IND vs BAN: బంగ్లాదేశ్ పై టీం ఇండియా రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 45/4 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకు రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ అద్బుతంగా ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
అంతకుముందు 145 పరుగుల ఈజీ టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.2 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 6 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా మెహిదీ హసన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.గిల్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ కూడా మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లోనే జాకీర్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తరువాత జయ్‌దేవ్ ఉనద్కట్(13), రిషబ్ పంత్ (9), అక్షరపటేల (34) పరుగులు చేసి అవుటయ్యారు.
తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ 8వ వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.శ్రేయాస్ అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 6, 2, 4,4 చేసొ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచును ముగించాడు. దీనితో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది.