Site icon Prime9

Asia Cup 2023 : ఆసియా కప్ సూపర్ 4 లో లంకపై గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత్..

india vs srilanka match highlights in asia cup 2023 super 4

india vs srilanka match highlights in asia cup 2023 super 4

Asia Cup 2023 : ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాట్స్ మెన్ లలో  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గురువారం సాయంత్రం శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు వియం సాధిస్తే ఆ జట్టు భారత్ తో ఫైనల్స్ లో ఆడుతుంది. ఆసియా కప్ (Asia Cup 2023) చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆదుకున్న రోహిత్.. అండగా కేఎల్ రాహుల్, కిషన్.. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) , శుభ్‌మన్‌ గిల్‌ (19: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) తో మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. కానీ దునిత్ వెల్లెలాగె వేసిన 12వ ఓవర్లో శుభ్‌మన్ అవుట్ అవ్వడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వెంటవెంటనే విరాట్‌ కోహ్లీ (3: 12 బంతుల్లో), రోహిత్‌ కూడా వెల్లెలాగె బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరారు.

ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌ (39: 44 బంతుల్లో, రెండు ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (33: 61 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జట్టు స్కోరు 154 వద్ద వెల్లెలాగే.. రాహుల్ ని ఔట్ చేశాడు. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా (5: 18 బంతుల్లో), రవీంద్ర జడేజా (4: 19 బంతుల్లో), బుమ్రా (5: 12 బంతుల్లో), కుల్‌దీప్‌ యాదవ్‌‌ లు (0: 1 బంతి) స్వల్ప స్కోర్లకే ఔట్‌ అయ్యారు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (26; 36 బంతుల్లో, ఒక సిక్సర్) పోరాడటంతో భారత్ స్కోరు 213 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఐదు వికెట్లు తీసి శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా(20 ఏళ్ల 246 రోజులు) రికార్డులకు ఎక్కాడు.

Image

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 25 పరుగులే శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ కి చేరింది. పతుం నిశ్శంకను (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), కరుణ రత్నే (2: 18 బంతుల్లో), కుశాల్ మెండిస్‌లు (15: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) తక్కువక స్కోర్ కే ఔట్ కాగా.. సదీర సమరవిక్రమ (17: 31 బంతుల్లో, ఒక ఫోర్), చరిత్ అసలంక (22: 35 బంతుల్లో, రెండు ఫోర్లు) శ్రీలంక ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దీర సమరవిక్రమ, చరిత్ అసలంకలను కుల్దీప్ యాదవ్ తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కెప్టెన్ దసున్ షనకను రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో శ్రీలంక 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఇక విక్టరీ ఖాయం అనుకున్న క్రమంలో ధనుంజయ డిసిల్వ (41: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) శ్రీలంక విజయంపై ఆశలు రేపారు. ఏడో వికెట్‌కు ఏకంగా 63 పరుగులు జోడించిన క్రమంలో జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వారు తక్కువ స్కోర్ కే ఔట్ అవ్వడంతో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, బుమ్రా, జడేజా రెండేసి వికెట్లు, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

Exit mobile version
Skip to toolbar