Site icon Prime9

IND vs ENG: హాఫ్ సెంచరీలు బాదిన కోహ్లీ, పాండ్యా.. ఇంగ్లండ్ టార్గెట్@169

india-vs-england-2nd-semi-final-cricket-score-england-target

india-vs-england-2nd-semi-final-cricket-score-england-target

IND vs ENG: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు ముందు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం విదితమే. కోహ్లీ, హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్ లో ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 27 పెద్దగా రాణించలేకపోయారు. అతి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కానీ ఆ తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, హార్ధిక పాండ్యా చెరో హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారించారు. విరాట్ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషబ్ పంత్ 6 (రనౌట్), రవిచంద్రన్ అశ్విన్ 0(నాటౌట్) పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, అదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: అర్జున్‌ కపూర్‌తో పెళ్లికి ఓకే చెప్పిన మలైకాఅరోరా.. హాట్‌ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌

Exit mobile version