India Records: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలను భారత్ అలవోకగా గెలుచుకుంది. ఇక మూడో వన్డేలో భారత్ 317 పరగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. భారీ తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక మాత్రం కేవలం 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో గాయం కారణంగా అషెన్ వాండర్సే బ్యాటింగ్ చేయలేదు. మరి ఈ మ్యాచ్ లో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
స్వదేశంలో 21 సెంచరీలు బాదిన రికార్డును కోహ్లి సృష్టించాడు.
ఇంతకుముందు 20 సెంచరీలు బాదిన రికార్డ్ సచిన్ పేరిట ఉంది.
166 పరుగులు చేసిన కోహ్లీకి ఇది వన్డేల్లో రెండో అత్యధిక స్కోరు.
2012లో పాకిస్థాన్‌పై విరాట్ 183 పరుగులు చేశాడు.
శ్రీలంకపై కోహ్లీకి ఇది పదవ సెంచరీ. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డ్.
అంతకముందు సచిన్ వెస్టిండీస్‌పై 9 సెంచరీలు సాధించాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే ఇతి పెద్ద విజయం.
ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగులతో గెలిచింది.
న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ దాటేసింది.
ఈ మ్యాచ్‌లో బౌలర్ సిరాజ్ (4/32) మంచి ప్రదర్శన చేశాడు. వన్డేల్లో సిరాజ్ అత్యుత్తమ బౌలింగ్ ఇదే.
వన్డేల్లో శ్రీలంకకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు.
106 బంతుల్లో 150 అందుకున్న రెండో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఇషాన్ కిషన్ 103 మెుదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో విరాట్ 8 సిక్స్‌లు బాదాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు ఇవే.
వన్డే చరిత్రలో భారత్ కు శ్రీలంకపై ఇది నాలుగో అత్యధిక స్కోర్.
లంక ఆటగాడు అవిష్క ఈ సిరీస్‌లో మూడు సార్లు సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకున్న ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
మొదటి స్థానంలో సచిన్.. రెండో స్థానంలో సనత్ జయసూర్య ఉన్నాడు.
కోహ్లీ కేవలం 66 సిరీస్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
శ్రీలంకపై అత్యధిక అర్ధసెంచరీలు చేసిన వ్యక్తుల్లో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు.
తొలిస్థానంలో సచిన్ 25 అర్ధ సెంచరీలు ఉన్నాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/