Site icon Prime9

Gambhir on Rohit & Kohli Retirement: టెస్టుల్లో రోహిత్‌ శర్మ, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టం: గంభీర్‌

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir reacts on Rohit and Virat Kohli’s Retirement: టీంమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ లేకుండా భారత్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీనియర్‌ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తొలిసారిగా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు.

 

కొత్తతరం వస్తుందనే నమ్మకం ఉంది..

టెస్టుల్లో రోహిత్‌, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమైన పని అని గంభీర్‌ పేర్కొన్నాడు. కొత్తతరం వస్తుందనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పడు ఇద్దరు సీనియర్లు లేకుండా ఆడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. తాము సిద్ధంగా ఉన్నామని ఇతరులు చెప్పేందుకు ఇది మంచి అవకాశమని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇద్దరు లేకుండా ఆడటం మాత్రం కష్టమైన పనేనని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడారు. గతంలో స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా లేకుండా భారత్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిందని ఇందుకు ఉదాహరణగా గంభీర్‌ చెప్పాడు.

 

ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో లేని బుమ్రా..

ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో బుమ్రా అందుబాటులో లేరని, అప్పుడు కూడా తాను ఇదే చెప్పాను అన్నారు. ఎవరైనా ఒకరు మిస్‌ అయితే మరొకరికి జాతీయ జట్టుకు ప్రత్యేకంగా ఏదైనా చేసే అవకాశం వస్తుందని చెప్పాడు. ఆ అవకాశం కోసం వేచి ఉండే ఇతర ఆటగాళ్లు ఉంటారని తాను నమ్ముతానని గంభీర్‌ స్పష్టం చేశాడు.

 

రిటైర్మెంట్‌ ప్రకటించడం వారి వ్యక్తిగతం..

కోహ్లీ, రోహిత్‌ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడం వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకువచ్చే హక్కు జట్టు యాజమాన్యానికి గానీ, సెలెక్షన్‌ కమిటీకి లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీంమిండియా సిద్ధమవుతోంది. హిట్‌మ్యాన్ లేని నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ జట్టును శనివారం ప్రకటించే అవకాశం ఉంది.

 

Exit mobile version
Skip to toolbar