Asia Cup 2022: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్లో రిషబ్ పంత్ క్రీజ్ బయట ఉన్నాడు. ఫామ్లో ఉన్న పంత్ క్రీజ్ బయట ఉండటమేంటని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇది మాత్రమే కాకుండా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకున్నారు. దినేష్ కోసమే పంత్ ను పక్కన పెట్టారా అని పలు అనుమానాలు వస్తున్నాయి. బ్యాటింగ్ లో రవీంద్ర జడేజాను తీసుకున్నారు.
ఈ విషయంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ఇలా తీసుకోవడం మంచిదే అంటున్నాడు. పంత్ ఆటతీరుకు, కార్తిక్ ఆట తీరుకు పోలిక ఏంటని, కార్తీక్ ఐపీఎల్ మ్యాచ్ నుంచి మంచి ఫామ్ల్ ఉన్నాడని,టెస్టులు, వన్డే మ్యాచ్లో పంత్ మంచిగా రాణించాడని, కానీ ఇప్పుడు కార్తిక్ అవకాశం ఇస్తే తన టాలెంట్ ఏమిటో చూపిస్తాడని, మహా ఐతే తను ఆడిన ఇంకా రెండు, మూడేళ్లు మాత్రమే ఆడగలడని, తను బెస్ట్ ఫినిషర్గా గతంలో చాలా మ్యాచులు గెలిపించాడని పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉండగా ఇంకో పక్క గంభీర్ పంత్ టీంలో లేకపోతే లెఫ్ట్ హ్యండర్ బ్యాట్సమెన్ తో ఆట అంత ఆడలేముగా అని ఇంకో పక్క వాదిస్తున్నాడు. పంత్ ను తరువాత మ్యాచ్లో ఐనా తీసుకోవాలి అని గట్టిగా పట్టుబడుతున్నారు. జట్టులో ఎవరు ఉంటారో, ఎవరు క్రీజ్ బయట ఉంటారో ? అసలు ఏం జరుగుతుందో అనేది తెలియాలంటే తరువాత మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.