Site icon Prime9

HCA: హెచ్‌సీఎ పై మ‌రో కేసు న‌మోదు

HCA

HCA

Hyderabad: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటన పై 3కేసులు నమోదు చేశారు. తాజాగా హెచ్‌సీఎ పై బేగంపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభ సమయానికి వ్యత్యాసం ఉందంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీఎ తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటూ ఆరోపణ చేశాడు. దీంతో హెచ్‌సీఏ పై కేసు నమోదు చేశారు బేగంపేట పోలీసులు.

టికెట్‌ పై మ్యాచ్ ప్రారంభ సమయంలో 7:30 గంటలకు ఉండగా, 7 గంటలకే ప్రారంభమయిందని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో యువకుడు ఫిర్యాదు చేశాడు. అయితే, మ్యాచ్ 7 గంటలకే ప్రారంభం అవుతుందని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఒకరోజు ముందే అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఫిర్యాదు అందడంతో పోలీసులు అసోసియేషన్‌ పై కేసు నమోదు చేశారు. మరోవైపు టిక్కెట్ల విక్రయం సందర్బంగా జరిగిన తొక్కిసలాట పై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Exit mobile version