Site icon Prime9

Chennai Super Kings vs Gujarat Titans : గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఐపీఎల్.. బోణి కొట్టిన గుజరాత్

chennai-super-kings-vs-gujarat-titans match details

chennai-super-kings-vs-gujarat-titans match details

Chennai Super Kings vs Gujarat Titans : క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ 16 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మొదటి మ్యాచ్ కి ఆతిధ్యం ఇచ్చింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు జరగకపోవడంతో ఈ ఏదై మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ లతో దుమ్ముదులిపేశారు. రష్మిక మందన్నా, తమన్నా తమ స్టెప్పులతో మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..

డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ ఒక వైపు.. ఐపీఎల్ లో స్ట్రాంగ్ గా ఉండే చెన్నై సూపర్ కింగ్స్‌ మరోవైపు మొదటి పోరులో తలపడ్డారు. కాగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 178 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ 182/5తో ఛేదించి విజయం సాధించింది. టార్గెట్ బలంగానే ఉన్నప్పటికీ గుజరాత్ జట్టుకి ఓపెనర్లు శుభమన్ గిల్ (63: 36 బంతుల్లో 6×4, 3×6), సాహా (25: 16 బంతుల్లో 2×4, 2×6) మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడి నెలకొల్పగా.. నెం.3లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సుదర్శన్ (22) కూడా దూకుడుగా అది స్కోర్ బోర్డు లో వేగం పెంచాడు. అయితే.. కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), విజయ్ శంకర్ (27) కీలక సమయంలో ఔటైపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరగా 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో 19 వ ఓవర్లో రషీద్ ఖాన్ (10 నాటౌట్: 3 బంతుల్లో 1×4, 1×6) సిక్స్, ఫోర్ కొట్టగా.. లాస్ట్ ఓవర్ లో రాహుల్ తెవాటియా (15 నాటౌట్: 14 బంతుల్లో 1×4, 1×6) రాహుల్ తెవాటియా ఒక 6, ఒక 4 కొట్టి గుజరాత్ కి విక్టరీని అందించాడు.

 

అంతక ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో 4×4, 9×6) చెలరేగి గుర్తుపెట్టుకునే ఇన్నింగ్స్ నెలకొల్పాడు. అంతకు ముందు ఇన్నింగ్స్ లలో ఆడినట్లు కాకుండా ముందు నుంచే దూకుడుగా పరుగులు రాబట్టాడు. జోడీగా వచ్చిన మొయిన్ అలీ (23: 17 బంతుల్లో 4×4, 1×6) మొదట్లో స్పీడ్ పెంచి ఆడగా.. చివర్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (14 నాటౌట్: 7 బంతుల్లో 1×4, 1×6) కూడా ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. మ్యాచ్ మొత్తం ఒకవైపు ఉంటే ధోనీ కొట్టిన ఈ సిక్సర్ మాత్రం ఒక వైపు అనేలా ధోనీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జాషువా లిటిల్‌కి ఒక వికెట్ దక్కింది.

ధోనీ కొట్టిన ఈ సిక్సర్ తో ఐపీఎల్ లో వే జట్టు తరుపున ఎక్కువ సిక్సర్ లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా ధోనీ రికార్డుల్లో కెక్కాడు. ధోనీ కంటే ముందు మరో నలుగురు ప్లేయర్లు ఈ ఘనత సాధించారు. వారిలో గేల్, డేవిల్లియర్స్, కోహ్లీ, ఉన్నారు.

Exit mobile version