Site icon Prime9

Bangladesh vs India: బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ముగిసింది – టీమిండియా లక్ష్యం ఎంతంటే!

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతోంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్..  49.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమయ్యారు. ఆరంభంలో తొలి రెండు ఓవర్లకు కేవలం 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది.  తొలి ఓవర్‌లో ఓపెనర్ సౌమ్యా సర్కార్(0) డకౌట్ కాగా..ఆ తర్వాత ఓవర్‌లో బంగ్లా కెప్టెన్ శాంటో(0) కూడా డకౌట్ కావడంతో బంగ్లా కష్టాల్లో పడింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెహిదీ హసన్(5), ముష్ఫికర్(0) సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. నిలకడగా ఆడుతున్న తంజిద్(25)ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 35 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది.

భారీ భాగస్వామ్యం..

కాగా, 35 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాను తౌహిద్‌ హృదయ్, జాకర్‌ అలీలు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 144 పరుగులతో కీలక భాగస్వామ్యంతో బంగ్లా పరువు కాపాడారు. తౌహిద్‌ హృదయ్ సెంచరీతో చెలరేగగా.. జాకర్‌ అలీ 68 పరుగులతో రాణించాడు. చివరిలో రిషద్ హుస్సేన్(18) పరుగులు చేయగా.. సాకిబ్(0), అహ్మద్(3) విఫలమయ్యారు. దీంతో బంగ్లా స్కోర్‌ 228 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా 3 వికెట్లు , అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.

Exit mobile version
Skip to toolbar