Site icon Prime9

Jasprit Bumrah: మళ్లీ అగ్ర‌స్థానానికి.. టెస్టు బౌల‌ర్ల‌లో బుమ్రాకు టాప్ ర్యాంక్‌

Bumrah back as No. 1 Test bowler: టెస్టు బౌల‌ర్ల‌లో బుమ్రా మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరాడు. బుధవారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా ఒకటో ర్యాంకులో నిలిచాడు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవటంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, ఆ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టటమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా రెండో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా సీమర్ జోష్ హేజిల్‌వుడ్‌ మూడో స్థానాన్ని కైవశం చేసుకున్నాడు. ఈ ర్యాంకుల జాబితాలో మరో భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో, రవింద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచారు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్ట్ బౌలర్ల జాబితాలో మూడు స్థానాలు ముందుకు వచ్చి 25వ ర్యాంకులో నిలిచాడు.

Exit mobile version