IND vs AUS 3rd ODI: భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. (IND vs AUS 3rd ODI)
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇక మొదటి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో వన్డేలో ఓటమిపాలై డీలాపడింది.
చెన్నైలో జరిగే మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
ఈ మూడో వన్డేలో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. చెన్నై లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు
మూడో వన్డేలో ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగింది.
తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఆచి తూచీ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.
మిచెల్ మార్ష్.. ట్రావిస్ హెడ్ క్రీజులో కొనసాగుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో వార్నర్ మిడిలార్డర్ లో రానున్నాడు. అతడి కెరీర్ లో ఓపెనర్ గా దిగని రెండో మ్యాచ్ గా ఇది నిలవనుంది.
వార్నర్ నాలుగో స్థానంలో రానున్నట్లు తెలుస్తోంది.
తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా