Australia vs India 1st test match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి ప్రదర్శిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి 30 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట రెండో ఓవర్‌లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా(4) భారీ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. వెంటనే రిషబ్ పంత్ అద్భుతంగా డ్రైవ్ చేసి పట్టుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. దీంతో పరుగులు తీసేందుకు ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయితే 17వ ఓవర్‌లో హర్షిత్ రాణా వేసిన బంతికి స్మిత్ తప్పించుకున్నాడు. రాణా ఎల్బీ అపీల్ చేయగా.. ఆంపైర్ నాటౌట్ ప్రకటించాడు. దీంతో బుమ్రా డీఆర్ఎస్ కోరగా.. సమీక్షలోనూ నాటౌట్ తేలింది. దీంతో ఆసీస్ బ్యాటర్లు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆసీస్ 79 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్(17) వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. హెడ్‌తో కలిసి నిలకడగా ఆడుతున్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే భారత్ విజయానికి మరో ఐదు వికెట్లు అవసరం ఉండగా.. ఆసీస్ గెలిచేందుకు 430 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్(63), మార్ష్(5) క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 3 వికెట్లు తీశారు. ఇంకా ఆస్ట్రేలియా విజయానికి 430 పరుగులు అవసరం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150, ఆసీస్ 104 పరుగులు చేయగా.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది.