Ind vs Aus 1st ODI: నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు.. 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్

Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టీమిండియా బౌలర్ల ధాటికి.. ఆస్ట్రేలియా 188 పరుగులకే చాప చుట్టేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది.

కుప్పకూలిన ఆసీస్

ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి వన్డేలో బౌలర్లు రాణించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు అందుకున్నాడు. మెుదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు కేవలం 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. జోష్ ఇంగ్లీస్ 26 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగానే వెనుదిరిగారు.

నిప్పులు చెరిగిన బౌలర్లు..

తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ను 188 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా 2 రెండు వికెట్లు తీయగా.. కుల్‌దీప్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు. బౌలర్లు చెలరేగడంతో 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది.