Site icon Prime9

Ravana: రావణుడికి పది తలలు ఎలా.. ఎందుకు వచ్చాయో తెలుసా..?

in ramayana why-did-ravana-had-10-heads

in ramayana why-did-ravana-had-10-heads

Ravana: రామాయణం ప్రకారం రావణాసురిడికి పది తలలు ఉంటాయని వినే ఉంటారు. కానీ మీకెప్పుడైనా సందేహం వచ్చిందా.. అసలు రావణుడికి పదితలలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఆ పది తలల వెనుకున్న కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు వీటన్నింటికి సమాధానం కావాలంటే ఈ కథనం చదివెయ్యండి.

రాక్షసరాజైన రావణుడు మా అన్న. అతను విశ్రవసుని కుమారుడు. మహావీరుడు. మిక్కిలి బలశాలి అన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు’ అని పంచవటిలో శ్రీరామచంద్రుడితో తనను తాను పరిచయం చేసుకునే సందర్భంగా శూర్పణఖ పలికిన మాటలని శ్రీమద్రామాయణం చెప్తుంది. శూర్పణఖ రావణుడి సోదరి. వనవాసంలో ఉన్న రాముడిపై శూర్పణక మోజుపడడంతో ఆమె ముక్కు చెవులు, పెదాలు కోసి పంపుతాడు లక్ష్మణుడు. దానితో రావణాసురుడు కోపంతో పంచవటిని చేరి మారువేశంలో సీతాపహరణం గావిస్తాడని రామాయణగాథ.ఇకపోతే రావణుడు బ్రాహ్మణోత్తముడు, బలవంతుడు, గొప్ప తపశ్శాలి. సనకసనందనాది బుుషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారని పురాణం చెప్తుంది.

ఇక రావణుడికి పది తలలు ఉండటంపై ఐతే వివిధ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. విశ్రవసు భార్య కైకసి. దాంపత్య సుఖాన్ని కోరి ఆయనను చేరిందట. అయితే అప్పటికే ఆమె పదకొండుసార్లు రుతుమతి అయినట్లుగా విశ్రవసు తెలుసుకుంటాడు. అయితే ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులను పొందాలని విశ్రవసు భావిస్తాడు. కానీ, కైకసి మాత్రం తనకు ఇద్దరు పుత్రులే కావాలనుకుంటుందట. ఈ క్రమంలోనే తపోనిధి అయిన విశ్రవసు తన మాట, మరియు తన భార్య కైకసి మాట ఇద్దరి కాంక్ష వృథా కాకుండా, పది తలలున్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడినీ ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ చెప్తుంది. ఇలా విశ్రవసు అనుకున్నట్టుగా 11 మంది, కైకసి కోరినట్టుగా ఇద్దరు కుమారులు జన్మించినట్టు పురాణగాథ చెప్తుంది.

మరో పురాణ కథ ప్రకారం విష్ణుమూర్తి ఉగ్ర నరసింహ అవతారంలో తనను సంహరించే సమయంలో ‘అకస్మాత్తుగా పుట్టి, ఇరవై గోళ్లతో నన్నొక్కణ్ని చంపడం కూడా ఓ పౌరుషమేనా’ అంటూ హిరణ్యకశిపుడు అంటాడట. దానికి శ్రీహరి అప్పుడు ‘తదుపరి జన్మలో నీకు పది తలలు, ఇరవై చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి నిన్ను సంహరిస్తాన’ని మహావిష్ణువు అన్నాడని ప్రచారంలో ఉంది. రావణుడికి కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అతను కోరుకున్నప్పుడు పది తలలు, ఇరవై చేతులు వస్తాయంట. అయితే, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉండి వీటిని అదుపులో పెట్టుకునేవాడే దశకంఠుడు అని పెద్దలు చెప్తుంటారు. ఇలా రావణాసురిడికి పదితలలపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఏది ఏమైనా అత్యంత మేథాశక్తి, తపోశక్తి కలిగిన రావణుడు సీతాపహరణం వల్ల మాత్రమే మనకు చెడ్డవాడిగా.. పేరులో అరుడు అని ఉండడం వల్ల అరుస జాతికి సంబంధించిన వాడిగా భావిస్తాం కానీ.. అతను బ్రాహ్మనోత్తముడని, గొప్ప శివ భక్తుడని, మంచి పరిపాలనా దక్షుడని కొందరు భావన.

ఇదీ చదవండి: నాలుగు పిల్లర్లపై దేవాలయ నిర్మాణం….చూడాలంటే విమానం ఎక్కాల్సిందే…

Exit mobile version