Kishan Reddy: సీఎం కేసీఆర్ చండూరు సభలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికల సభలో ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కు అపనమ్మకం అభద్రతా భావం పెరిగాయని నిరాశ, నిస్పృహతో ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన విమర్శించారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారన్నారు కిషన్ రెడ్డి.
గత ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలనే గ్రామఫోన్ రికార్డు వేసినట్టు మళ్ళీ చండూరులో మాట్లాడారని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఏ పార్టీలో గెలిచారో చెప్పాలని.. వేరే పార్టీ గుర్తుతో గెలిచిన వారిని అక్రమంగా, దొడ్డి దారిన తెరాస పార్టీలో చేర్చుకుని ఇప్పుడు సీఎం కేసీఆర్ నైతిక విలువలు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొయినాబాద్ సంఘటనలో FIR లో డబ్బులకు సంబంధించిన వివరాలు ఎందుకు పొందుపరచలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రెస్ టీఆర్ఎస్ అని వైఎస్సార్ పార్టీ ఎమ్యెల్యే, ఎంపీని మీ పార్టీలో చేర్చుకోలేదా.? అని ఏ రకంగా కమ్యూనిస్ట్ నాయకులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు.? సీపీఎం ఎమ్యెల్యే ను కూడా చేర్చుకుని తెరాస పార్టీలో కలుపుకుని ఆ పార్టీ గొంతు నొక్కారని ఆయన అన్నారు.
కేంద్రం రూ.800కోట్లను ఫ్లోరైడ్ నివారణకు ఇచ్చింది.. దమ్ము ధైర్యం ఉంటే దీన్ని నిరూపించండి అంటూ కేసీఆర్ కు ఛాలెంజ్ కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమ పార్టీకి లేదని.. ఎక్కడా కూడా చెప్పలేదు. మీరు పెట్టాలనుకుంటే మేము అడ్డుకుంటామని ఆయన తెలిపారు. మీ అన్యాయాలపై మీటర్లు పెడతామని.. బీజేపీ అధికారంలోకి వస్తే మీ అవినీతికి మీటర్లు పెట్టి కక్కిస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాల్లో సరైన రోడ్లు, వసతులు లేవు కానీ ప్రతీ ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. నువ్వు ప్రధాన మంత్రివి అయితే దేశ వ్యాప్తంగా బెల్ట్ షాప్స్ పెడ్తావా.? అంటూ విమర్శించారు. తెలంగాణ నీ ఒక్కడి వల్ల రాలేదని రాచరిక రాజకీయాలకు తెలంగాణ ఘోరీ కట్టిందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు సరైన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని కేసీఆర్ బిచ్చ గత్తెని చేశాని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: ఒళ్లు మరిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతుంది.. జర ఆలోచించండి- సీఎం కేసీఆర్