Sidharth-Kiara Reception : బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహా బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా ఈ జంటపెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌లోని పలువురు సినీ సెలబ్రెటీలు పెళ్లికి హాజరయ్యారు. కాగా ఈ జంట ఆదివారం ముంబై లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది.
ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోల, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. షారూక్ ఖాన్, అలియా భట్, కరణ్ జోహార్, విద్యాబాలన్, కరీనా కపూర్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ లతో సహా పలువరు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు విషెస్ చెప్పారు.