RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు. ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది. కాగా తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో సత్తా చాటింది ఈ మూవీ. ఏకంగా ఐదు అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్సీఏ స్పాట్ లైట్ (విదేశాల్లో సైతం విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం) అవార్డులను సొంతం చేసుకుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/