Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు రాలేదు. అయితే తన సొంతగడ్డ అయిన తమిళంలో మాత్రం ఈ అమ్మడుకు అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంది. తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన డాక్టర్, సూర్య హీరోగా నటించిన ఈటీ చిత్రంలో ఈ భామ కనిపించింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న రావణసుర చిత్రంలోనూ ప్రియాంక నటిస్తోంది.