Pinkvilla style icons: లైఫ్‌స్టైల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా హబ్ పింక్ విల్లా తన పింక్ విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డుల రెండో ఎడిషన్ ముంబై లో గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డుల్లో భాగంగా చలనచిత్రం, టెలివిజన్, వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్ ఇండస్ట్రీలో దిగ్గజాలను గౌరవిస్తారు. ముంబై జుహూలో జరిగిన ఈ రెండో ఎడిషన్ అవార్డుల కార్యక్రమానికి తారలు దిగి వచ్చారు.
అన్ని రంగాలకు చెందిన సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు అత్యుత్తమ ఫ్యాషన్ తో మైమరిపించారు. ఎరుపు రంగు కటౌట్ గౌన్ లో కియారా హోయలు పోతే.. కాజోల్ క్లాసిక్ గౌన్ మెరిసింది. జాన్వీ కపూర్, అనన్య పాండే, దిశా పటానీ , మౌనీ రాయ్ నోరా ఫతేహి, వి
ద్యాబాలన్, సానియా మిర్జా, రకుల్ ప్రీతి సింగ్ లు తమ స్టయిల్స్ లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు.