Janasena Formation Day: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పుడు అభిమాన సముద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. అంతకుముందు బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకునున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Janasena Formation Day: రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు వారాహిపై బందరు బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్
