Niharika Konidala : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా కొత్త ఫోటోషూట్ తో కిక్కెక్కించింది. అచ్చ తెలుగు ఆడపిల్లలా దర్శనమిచ్చింది. ఎరుపు లంగావోణీ, ముక్కుకు ముక్కెర, కర్లీ హెయిర్ తో వేసిన జడ.. ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.