Pinkey Chowdary : ప్రస్తుత కాలంలో టాలెంట్ ని నిరూపించుకోవడానికి మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది “సోషల్ మీడియా”. ఇక వాటిలో ఇంస్టాగ్రామ్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న యంగ్ బ్యూటీ పేరు “ఊహ చౌదరి”. ( pinkey chowdary ) అనే యూజర్ నేమ్ తో ఇన్ స్టా లో చూడవచ్చు. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ భామ.. స్టైలిష్ లుక్స్.. ఫిదా చేసే గ్లామర్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. హెచ్ఆర్ & మార్కెటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. అనంతరం మోడలింగ్ పై మక్కువ తో.. సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ తన కెరీర్ వైపు అడుగులు వేస్తుంది. కేవలం తక్కువ కాలం లోనే వేలల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఇన్ స్టా లో ట్రెండింగ్ గా మారుతుంది.
ఈ అమ్మడి ఫోటోస్, రీల్స్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పాలి. తన అందం, అభినయంతో మంచి ఫాలోయింగ్ పెంచుకోగా.. ట్రెండీ వేర్ లోనే కాకుండా చీర కట్టులో కూడా సాంప్రదాయం ఉట్టిపడేలా లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఇక ఆమె ఏదైనా పోస్ట్ చేసిన కాసేపటికి మిలియన్స్ లో వ్యూస్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలల్లో నటించాలని ఆమె ఫాలోవర్స్ అంతా కోరుకుంటున్నప్పటికీ.. ఊహ మాత్రం మోడలింగ్ పైనే ఫోకస్ అంటుంది. ఇక ఇప్పటికే నారాయణి సిల్క్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, కళామందిర్ వంటి పలు వాటిని ప్రమోట్ చేసింది. భవిష్యత్తులో కూడా మోడలింగ్ లో రాణిచాలని ఉందంటూ చెప్తున్న ఊహ.. కెరీస్ లో మంచి అవకాశాలు పొందాలని ఆమె ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఇక ఈమె లేటస్ట్ ఫోటోస్, రీల్స్ మీకోసం ప్రత్యేకంగా..