
GlobalStarRamCharan: రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.